English   

‘చి.ల.సౌ’ హనుమాన్ భక్తుడు

Chi-La-Sow
2018-05-08 14:27:40

సుశాంత్ లేటెస్ట్ మూవీ ‘చి.ల. సౌ’టీజర్ విడుదలైంది. అందాల రాక్షసితో నటుడుగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడీ మూవీని. రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ టీజర్ లో సుశాంత్ పెళ్లిగోల కనిపిస్తోంది. పెళ్లంటే ఇష్టం లేని కుర్రాడిపై పెళ్లి కోసం ప్రెజర్ పెట్టే వాళ్లు చుట్టూ ఉంటారు. కానీ అతను మాత్రం లైఫ్ లాంగ్ బ్యాచులర్ గా ఉండాలనే కోరిక ఉన్న కుర్రాడు. ఇది యంగ్ ఏజ్ లో ఉన్న ప్రతి కుర్రాడికీ, అమ్మాయికీ కామన్. అదే పాయింట్ గా రాహుల్ రవీంద్రన్ ఈ కథను తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. అయితే హీరోయిన్ వెర్షన్ కూడా వచ్చాక దాన్ని క్లియర్ గా చెప్పుకోవచ్చు.

మొత్తంగా సుశాంత్ మరీ ‘స్టార్ హీరో’రేంజ్ వేశాలేం వేయకుండా కామ్ గా బాయ్ నెక్ట్స్ డోర్ లా కనిపించడం బావుంది. అతని ఫ్రెండ్ గా రాహుల్ రవీంద్రన్ రియల్ లైఫ్ ఫ్రెండ్ వెన్నెల కిశోర్ కామెడీ పార్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సుశాంత్ తాను సల్మాన్ ఫ్యాన్, హనుమాన్ భక్తుడిని అంటూ చెప్పే డైలాగ్, థియేటర్ సీన్ కూడా బావుంది. ఇక ఫినిషింగ్ లో వెన్నెల కిశోర్ చెప్పిన అప్పుడేమో అప్పుడే పెళ్లేంటీ అన్నారు.. ఇప్పుడు.. ఇప్పుడు పెళ్లేంట్రా అంటున్నారు అనే డైలాగ్ హిలేరియస్ గా ఉంది. మరి చాన్నాళ్లుగా.. హీరో అనిపించుకోవాలని ప్రయత్నిస్తోన్న సుశాంత్ కు ఈ చిలసౌ అయినా లక్ ఇస్తుందేమో చూడాలి. 

More Related Stories