English   

చీకటి గదిలో చితక్కొట్టడానికి రెడీ అవుతున్నారు !

Chikati-Gadilo-Chitha-Kotudu
2019-03-16 06:01:00

చీకటి గదిలో చితక్కొట్టడు ఈ టైటిల్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే అందులోనే కావాల్సినంత బూతు ఉంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది చీకటి గదిలో ట్రైలర్ విడుదలైన అప్పుడే సినిమా పూర్తిగా అడల్ట్ మూవీ అని అర్తమైపోయింది. తమిళనాట గతేడాది వచ్చిన ఒక సినిమాకు ఇది రీమేక్. అక్కడ తెరకెక్కించిన దర్శకుడు ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హేమంత్, ఆదిత్ అరుణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి అయిపోయింది. మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది చీకటిగదిలో చితక్కొట్టాడు సినిమా. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. పైగా సెన్సార్ సభ్యులు ఈ యూనిట్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా పెద్దల కోసం మాత్రమే తీశారని చిన్న పిల్లలను ఈ సినిమా నుంచి దూరంగా ఉంచాలని సెన్సార్ సభ్యులు గట్టిగా చెబుతున్నారు. దానికి తోడు చీకటిగదిలో చిత్ర యూనిట్ కూడా ఇది కేవలం పెద్దలకు మాత్రమే అని ముందే చెబుతోంది. ట్రైలర్ లోనే ఇది 18 ప్లస్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా తాము టార్గెట్ చేసిన ఆడియన్స్ కు రీచ్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు. ఇలాంటి పూర్తిస్థాయి బూతు సినిమా ఇంతవరకూ తెలుగులో రాలేదు. సాఫ్ట్ పోర్న్ మూవీస్ తెలుగులో తక్కువగా వస్తున్నాయి. ఈ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా వీటికి తెర తీస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే మరి ఇలాంటి సినిమాలు రావడం తెలుగు ఇండస్ట్రీకి మంచో చెడో అర్థం కావడం లేదు.

More Related Stories