English   

చీకటి గదిలో టీజర్ టాక్: చితక్కొట్టుడే

CHIKATI-GADILO-CHITHAKOTUDU
2019-01-04 19:18:12

తెలుగులో అడల్డ్ కంటెంట్ సినిమాలకు రోజరోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉన్నది. అరే ఈ అడల్ట్ కంటెంట్ ఇంటర్నెట్ లో దొరకదా అంటే పోర్న్ బ్యాన్ చేసినా ఎలాగోలా చూడచ్చు. కానీ మెయిన్ స్ట్రీం సినిమాలో అడల్ట్ కంటెంట్ చూస్తే ఆ కిక్కే వేరనుకుంటూన్నారో ఏమో ? బోల్డ్ కంటెంట్ సినిమాకి ఆదరణ పెరుగుతూనే ఉంది.  ఆ ఆదరణను క్యాష్ చేసుకోవడానికి బోల్డ్ సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో రావడం మొదలు పెట్టాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా "చీకటి గదిలో చితక్కొట్టుడు". ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజయింది. ఇదివరకు రిలీజయిన సినిమా ఫస్ట్ లుక్ సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీజర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. సినిమాలోని నటులు ఏమాత్రం తగ్గలేదు. కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న కత్తి మహేష్ ఎంట్రీతో టీజర్ మొదలవుతుంది. ఇదో హారర్ సినిమా కథ ఏంట్రా అంటే ఊరవతల ఉన్న బంగళాకి (బ్యాంకాక్ లోని పట్టాయాలో)  పన్లేని నలుగురు ఆ బంగాళాకి వెళ్తారు.  అక్కడున్న దెయ్యం వీళ్ళను ఎలా టార్చర్ పెట్టిందనేది కథ అట. అలాగే హారర్ సినిమా తీయాలంటే ఇది చాలని కానీ వీళ్ళు సెక్స్ హారర్ తీయలనుకున్నారని చెబుతూ కొన్ని అభ్యంతరకర సీన్లు వదిలారు. ఇక టీజర్ అంతా అయిపోయిన తర్వాత "ఈ సినిమా మామూలుగానే మూడు రోజులు ఆడుతుంది. మీరు ధర్నాలు.. డిబేట్లు పెట్టి సూపర్ హిట్ చేసేయకండి." అంటూ ఎండ్ చేశాడు. సినిమా టీజర్ కొంచెం రొమాన్స్ కొంచెం భయాన్ని కలగలిపి ఉన్నట్టుగా ఉంది. దెయ్యం కాన్సెప్ట్‌ను కూడా ఇందులో మిక్స్ చేసినట్టున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
 

More Related Stories