English   

చిలసౌ.. సూపర్ సుశాంత్

chilaosw
2018-07-29 10:27:17

గత కొన్నేళ్లుగా హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నానాతంటాలు పడుతోన్న అక్కినేని క్యాంప్ హీరో సుశాంత్. కాళిదాసులా వచ్చిన ఈకుర్రాడి కెరీర్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కాకపోతే అవన్నీ మాస్ హీరోగా చేసిన యత్నాలు. కానీ సుశాంత వచ్చే టైమ్ కు మాస్ సినిమాలకు జోష్ తగ్గుతోంది. పైగా అతనేమీ గూడ్ లుకింగ్ గయ్ కాదు. ఫిజిక్కూ అంత గొప్పగా లేదు.. అనే కమెంట్స్ కూడా ఉండేవి. దీంతో గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న సుశాంత్ లేటెస్ట్ గా చిలసౌ అనే సినిమాతో రాబోతున్నాడు. దీనికి అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కావడంతో ముందు నుంచి కొంత ఆసక్తి ఉంది. అయితే ఆ ఆసక్తిని అమాంతం పెంచేసింది లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్.

కొన్నాళ్ల క్రితం టైటిల్ తో ఆకట్టుకున్నారు వీళ్లు. తర్వాత రెండు టీజర్స్ భలే ఉన్నాయే అనిపించాయి. కానీ ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత ఫ్రెష్ గా ఉందో అర్థమౌతోంది. సుశాంత్ కూడా ఇకపై మాస్ సినిమాలు చేయను అనేలా రీసెంట్ గా ‘గట్టిగా కొడతా’ అనే షార్ట్ ఫిలిమ్ తో స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఇచ్చాడు రచయిత, దర్శకులకు. అయితే రాహుల్ ఈ కథ చెప్పిన విధానం కూడా అందులో ఉంటుంది. మొత్తంగా వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందా అనుకున్నవారికి ఈ ట్రైలర్ తో మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. 

కమ్ బ్యాక్ మూవీ ఇదీ అనిపించేలా ఉంది ట్రైలర్.. అప్పుడే పెళ్లి ఒద్దనుకునే కుర్రాడు.. అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకునే పేరెంట్స్.. ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు కూర్చున్న అమ్మాయి.. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాగా తీసుకున్న కథా పాయింట్. ట్రైలర్ మొత్తం అద్భుతంగా అనిపించిన ఈ కథను సినిమాగానూ ఇంతే అందంగా ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా ఇది పెళ్లి చూపులుకు మించిన విజయం సాధించే అవకాశం ఉంది. మొత్తంగా చిలసౌతో తన కమ్ బ్యాక్ మూవీని సూపర్ అనిపించేలా ఉన్నాడు సుశాంత్. 

More Related Stories