English   

చిన‌బాబు ఫ‌స్ట్ టాక్.. ఎలా ఉంది..?

karthi chinababu
2018-07-13 08:32:02

కార్తి మ‌రో హిట్ కొట్టాడా..? చిన‌బాబు ఎలా ఉంది..? గ‌తేడాది ఖాకీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న కార్తి ఇప్పుడు అదే విజ‌యం కంటిన్యూ చేసాడా లేదా అని అభిమానుల్లో ఒక‌టే కంగారు ఉంది. అయితే చిన‌బాబు ప్రీమియ‌ర్ షోస్ ఇప్ప‌టికే ప‌డిపోయాయి. యుఎస్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం చూస్తుంటే కార్తికి మ‌రో హిట్ వ‌చ్చిన‌ట్లే. ముఖ్యంగా త‌మిళ‌నాట అయితే చిన‌బాబుకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం క‌డైకుట్టి సింగంగా త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

పాండిరాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం రైతు స‌మ‌స్య‌ల ఆధారంగా వ‌చ్చింది. కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ డైలాగ్స్.. ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న క‌థ‌తో వ‌చ్చాడు పాండిరాజ్. తెలుగులో కూడా ఈ చిత్రం ఈజీగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఖాకీ త‌ర్వాత మ‌రోసారి కార్తి మంచి క‌థ‌తోనే వ‌చ్చాడు. ఫ‌స్టాఫ్ లో రైతు స‌మస్య‌ల‌ను బాగానే హైలైట్ చేసి.. సెకండాఫ్ లో ఎమోష‌న‌ల్ తో నడిపించాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి చిన‌బాబు కార్తికి ఎలాంటి విజ‌యం తీసుకొస్తుందో చూడాలిక‌..

More Related Stories