English   

చినబాబు చింపేశాడంతే

Chinababu thinning
2018-06-04 07:16:46

దేశానికి అన్నం పెట్టేది రైతు. రైతు లేకపోతే దేశమే లేదు. కానీ అతని పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదు. ఇందుకు కారణాలెవరైనా.. పుట్టించినవాడు దేవుడైతే పండించేవాడూ దేవుడే అనేది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఇదే పాయింట్ తో రాబోతోన్న సినిమా చినబాబు. కార్తీ హీరోగా నటించిన సినిమా. తమిళంలో కడైకుట్టి సింగంగా రాబోతోన్న ఈ సినిమాను తెలుగులో మిర్యాల రవీందర్ రెడ్డి అనువదిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ లోని డైలాగ్స్ చూస్తే చినబాబు చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. 

ఇక టీజర్ ఆద్యంతం కన్నుల పండగలా ఉంది. పల్లెటూరు.. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, ఎడ్ల పందాలు, పంతాలు.. ఇలా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసుకుని అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఇక సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించాడు. జమ చేసుకుంటే ఏదైనా పెరుగుతుంది. ఖర్చుకానీ జమ బంధుత్వమే వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని కార్తీ అన్న సూర్య నిర్మిస్తుండటం విశేషం. షాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. మొత్తంగా వచ్చే నెలలో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్న చినబాబు టీజర్ లో పెద్ద విజయం సాధించే లక్షణాలన్నీ ఉన్నాయనుకోవచ్చు. 

More Related Stories