English   

మన్మధుడు సినిమా చిన్మయి చావుకొచ్చింది !

 Chinmayi Sripaada
2019-08-10 09:03:15

ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టుగా తయారయ్యింది సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ కం లేడీ యాక్టివిస్ట్ చిన్మయి పరిస్థితి. ఎందుకంటే నాగ్ నటించిన తాజా సినిమా మన్మధుడు 2 నిన్న రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని లేదు కాబట్టి లైట్ తీసుకున్నా ఈ సినిమా దెబ్బ మాత్రంన్ ఒకరికి గట్టిగా తగులుతోంది. అది మరెవరో కాదు ఈ సినిమా దర్శకుడు రాహుల్ భార్య చిన్మయికి. మన్మథుడు 2’ సినిమాలో నాగార్జునకు అక్కగా నటించిన ఝాన్సీకి రకుల్ ప్రీత్ సింగ్‌ ఒక మాంచి లిప్ కిస్ లాగిస్తుంది. ఆ దెబ్బకి మూడ్ లోకి వెళ్ళిన ఝాన్సీ హాల్‌లో కూర్చుని ఉన్న భర్తను బెడ్ రూంకి బలవంతంగా లాక్కునిపోతుంది. నిజానికి ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఆడియన్స్‌కి ఇబ్బందికరంగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా జనం చిన్మయిని, సమంతాని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ గతంలో వచ్చిన కబీర్ సింగ్ సినిమాని కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు మాట్లాడితే మహిళల హక్కులు, రెస్పాన్సిబిలిటీ అంటూ సోషల్ మీడియాలో నీతులుచెప్పే చిన్మయికి ఇలాంటి సీన్లు కనిపించడంలేదా? F***తో మొదలయ్యే బూతులు మీ ఆయన తీసిన సినిమాలో చాలా ఉన్నాయని, సందీప్ వంగ తీస్తే బూతులు, మీ ఆయన చూస్తే నీతులా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిజానికి సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చినప్పుడే ఆమె టార్గెట్ అయ్యింది. ఇదొక బీ గ్రేడ్ సినిమా అని, నీ భర్త తీశాడు కాబట్టి ఎగేసుకుంటూ మార్నింగ్ షోలకి వెళ్ళావని, అదే వేరే దర్శకుడు కధా పరంగా కొన్ని సీన్స్ పెడితే వాటిని తప్పుపట్టావని ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆనాడు చిన్మయికి సపోర్ట్ గా నిలిచిన సమంతాను కూడా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. 

More Related Stories