English   

అవ్వ కోసమా.. గువ్వకోసమా.. చినబాబూ  

Chinna-Babu
2018-07-12 10:41:48

పల్లెటూరి సినిమా అనగానే ఒకప్పుడు ఎద్దుల బండ్లు, పందేలు గుర్తొస్తాయి. తర్వాత పచ్చిన పంట పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పల్లూటూళ్లు కూడా పట్నంలో మిక్స్ అయిన ట్రెండ్ నడుస్తోంది. ఈ టైమ్ లో కార్తీ చేసిన చినబాబు సినిమా ఈ 13న విడుదల కాబోతోంది. అయితే సినిమా నుంచి ట్రైలర్స్ కాకుండా ఓ చిన్న వీడియో కూడా విడుదల చేశారివాళ. ఈ వీడియోలో కార్తీ ఇంకా ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నాడు. సీన్ ప్రకారం చూస్తే.. ఓ ముసలావిడ.. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తీరా బస్ వచ్చాక ఆపరు. కారణం.. ఆమె కొన్ని కూరగాయల మూటలతో ఉంటుంది. అవి ఎక్కించుకుంటే బస్ లో జనం పట్టరు అని ఎక్కించుకోరు. అదే టైమ్ లో ఆ రూట్ లో ఎద్దుల బండిపై వచ్చిన కార్తీతో ఆ ముసలావిడ గోడు చెప్పుకుంటుంది. దీంతో తన ఎడ్లబండిలో ఆ ముసలావిడను ఎక్కించుకుని.. బస్ ను ఓవర్ టేక్ చేస్తాడు. బస్ వాడితో గొడవపడుతూ.. ఈ కూరగాయలు పండించేందుకు ఓ రైతు ఎంత కష్టపడతాడో తెలుసా..? అది తెలియాలంటే ఓ రోజు రైతుతో కలిసి కష్టపడు.. లేదంటే అతనితో కలిసి బ్రతుకు అంటూ నడిరోడ్డుపై క్లాస్ పీకుతాడు. ఇక ఇదే సీన్ లో కార్తీ హీరోయిన్ ను తొలిసారిగా చూసే సన్నివేశమూ ఉంది. మరి ఇంత సడెన్ గా ఈ వీడియో ఎందుకు విడుదల చేశారో కానీ.. అవ్వ కోసమా ఈ గువ్వ కోసమా అంటూ పరోటా బాలు చెప్పిన డైలాగ్ కూడా పేలింది. మొత్తంగా చినబాబు ఆకట్టుకునేలానే ఉన్నాడు. 

More Related Stories