English   

త్రివిక్రమ్ కు చినబాబు వార్నింగ్.

chinna babu and trivikram (2)
2018-03-03 09:49:19

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే చాలామంది ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని. కానీ మధ్యలో అజ్ఞాతవాసి పోవడంతో అంచనాలు కాస్త తగ్గాయనేది నిజం. అయినా సరే త్రివిక్రమ్ ఓ ఫ్లాప్ ఇచ్చిన ప్రతిసారీ ఓ సూపర్ హిట్ కొట్టాడు. ఈ సారి కూడా ఇది రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ నెల 23న సినిమా అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది. ఓపెనింగ్ తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే షూటింగ్ వెళుతుంది. ఈ నెల 26నుంచే రెగ్యులర్ షూట్ కు వెళ్తారట.

హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టను బిగ్గెస్ట్ టార్గెట్ సెట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో పాటు లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తయిన ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త లుక్ కూడా రెడీ అయినట్టే టాక్. మొత్తంగా అజ్ఞాతవాసి ప్రాబ్లమ్ ను మర్చిపోవడానికి వీలైనంత తొందరలో సినిమా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది హారిక హాసిని బ్యానర్. ఇందుకోసం ఈ సారి త్రివిక్రమ్ కు ఎక్కువ టైమ్ ఇవ్వడం లేదు. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ దసరాకే విడుదల చేయాలని చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్టు సమాచారం. నిజానికి త్రివిక్రమ్ డైరెక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. కొన్ని విషయాల్లో పూర్తి క్లారిటీతో ఉండడు అనే టాక్ ఉంది. అవన్నీ హారిక హాసిని బ్యానర్ రాధాకృష్ణ(చినబాబు)కు బాగా తెలుసు కాబట్టి.. ఈ సారి అలా కుదరదని చెప్పాడట. ఇటు ఎన్టీఆర్ కూడా దర్శకుడికి పూర్తిగా సరెండర్ అవుతున్నాడు. అడిగినన్ని డేట్స్ ఇచ్చేశాడు.. కాబట్టి ఆలస్యం అనే మాటే రావద్దని కాస్త గట్టిగానే చెప్పినట్టు ఇండస్ట్రీ టాక్. మొత్తంగా త్రివిక్రమ్ సంక్రాంతికి నిరాశపరిచినా.. దసరాకు దుమ్మురేపాల్సిందే. అంటే ఇటు ఎన్టీఆర్ కు కూడా గతేడాది దసరా మరీ గొప్పగా ఉందని చెప్పలేం. ఆ లోటు ఇటు ఎన్టీఆర్ కూ భర్తీ అవుతుంది.. మరి ఈ వార్నింగ్ త్రివిక్రమ్ పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

More Related Stories