English   

చిరంజీవి రెండు చేస్తున్నాడంట‌..!

chiranjeevi
2018-06-14 07:56:08

చిరంజీవి ఇప్పుడు సినిమా హీరో.. రాజ‌కీయ నాయ‌కుడు కాదు. ప‌రిస్థితులు చూస్తుంటే రాజ‌కీయాల‌తో ఆయ‌న‌కు పూర్తిగా బంధం తెగిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. మొన్న క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్స్ లో కూడా ప్ర‌చారం చేయ‌లేదు చిరు. దాంతో ఈయ‌న‌కు కాంగ్రెస్ కూడా దూరం పెరిగింది. దాంతో సినిమాలే లోకంగా ఉన్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం సైరా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. దాని త‌ర్వాత కొర‌టాల శివ సినిమా ఆల్ మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయి పోయింది. ప్ర‌స్తుతం పారిస్ లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. వ‌చ్చిన త‌ర్వాత చిరంజీవి సినిమాపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌నున్నాడు. ఇప్ప‌టికే చిరుకు ఓ క‌థ చెప్ప‌డం.. దానికి ఇప్పుడు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండ‌టం జ‌రుగుతున్నాయి. కొర‌టాల చెప్పిన క‌థ‌లో చిరంజీవి కొన్ని మార్పులు చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక దానికి త‌గ్గ‌ట్లే ఈ ద‌ర్శ‌కుడు కూడా మారుస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ చిత్రంలో చిరు రెండు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మెగాస్టార్ కు ద్విపాత్రాభిన‌యం బాగానే క‌లిసొచ్చింది. ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150లో కూడా ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఇక ఇప్పుడు కొర‌టాల సినిమాలోనూ ఇదే చేయ‌బోతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ఇందులో ఓ పాత్ర రైతు అయితే.. మ‌రోటి మిలినియ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి కొర‌టాల సినిమా మొద‌లుపెట్ట‌నున్నాడు చిరంజీవి. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..? 

More Related Stories