English   

చిరంజీవికి డీ హైడ్రేషన్.. అర్ధాంతరంగా ఆగిన ఆచార్య షూటింగ్.. 

Chiranjeevi Acharya
2021-03-09 19:23:32

సమ్మర్ ఇంకా పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే దారుణంగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మంలో కూడా ఎండలు బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు కూడా సమ్మర్ సెగలు తగిలాయి. కొన్ని రోజులుగా ఇల్లందు గనుల్లో షూటింగ్ చేస్తున్నారు ఆచార్య టీం. మార్చ్ 15 వరకు అక్కడే షూటింగ్ ప్లాన్ చేసాడు కొరటాల శివ. అక్కడి బొగ్గు గనుల్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల.

అయితే మూడు రోజుల్లోనే అర్ధాంతరంగా ఈ చిత్ర షూటింగ్ ముగించారని తెలుస్తుంది. 7 రోజుల షెడ్యూల్ 3 రోజుల్లోనే ముగించేసారు చిత్ర యూనిట్. దాంతో అంతా షాక్ అవుతున్నారు. దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆ కారణంగానే ఆచార్య షూటింగ్ కి ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది. అందుకే ఉన్నట్లుండి షూటింగ్ ఆపేసారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అక్కడ షూటింగ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అక్కడ ఉన్న అధిక వేడితో చిరంజీవి డీహైడ్రేషన్ కు గురయ్యారని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

More Related Stories