English   

మ‌ళ్లీ నోరు జారిన చిరంజీవి..

chiranjeevi again tongue slipped at Geetha Govindam Success Meet
2018-08-20 06:01:45

ఏదో ఒక్క‌సారి చేస్తే పొరపాటు.. మ‌రోసారి చేస్తే గ్ర‌హ‌పాటు.. కానీ ప్ర‌తీసారి చేస్తూ పోతే అది అల‌వాటు. ఇప్పుడు చిరంజీవికి మూడోది వ‌చ్చింది. త‌న ప‌ర బేధం లేకుండా అన్నిచోట్లా నోరు జారుతున్నాడు మెగాస్టార్. ఇదే ఇప్పుడు అక్క‌డున్న వాళ్ల‌తో పాటు సినిమా యూనిట్ కు కూడా లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. గీత‌గోవిందం స‌క్సెస్ మీట్ కు వ‌చ్చిన మెగాస్టార్.. అక్క‌డ సినిమా క‌థంతా చెప్పి షాక్ ఇచ్చాడు. విడుద‌లై ఐదు రోజులు అయింది.. ఇప్ప‌టికే క‌థ అంతా అంద‌రికీ తెలిసిపోయి ఉంటుంది.. అయినా కూడా క‌థ మొత్తం చెప్ప‌డం అనేది స‌రైంది కాదేమో అని కొంద‌రి భావ‌న.

సినిమాను మ‌లుపు తిప్పే స‌న్నివేశం గురించి కూడా అలా చెప్పేస్తే పాపం అక్క‌డే ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ బిత్త‌ర‌పోయి చూస్తున్నాడు. చేసేదేం లేక అల్లు అర‌వింద్ వైపు చూస్తే.. ఆయ‌నేదో స‌ర్ది చెప్పాడు. గ‌తంలో రంగ‌స్థ‌లం ఆడియో వేడుక‌లో కూడా రిలీజ్ కు ముందే క్లైమాక్స్ లో ఆది చ‌చ్చిపోతాడ‌ని చెప్పేసాడు చిరంజీవి. ఆయ‌న తెలిసి తెలియ‌క చేస్తోన్న చిన్న పొర‌పాట్లు సినిమాల‌పై ప్ర‌భావం చూపించక‌పోతే చాలు..! ఎందుకంటే ఆయ‌నంటే ఉన్న గౌర‌వంతో క‌నీసం ఒక్క‌రు కూడా క‌న్నెత్తి చూడ‌రు.. ప‌న్నెత్తి మాట్లాడరు. ఈ విష‌యం చిరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి మ‌రి..!

More Related Stories