English   

బోయపాటి మొండితనం.. చిరంజీవి ఫైర్

Chiranjeevi Angry on Director Boyapati Srinu for Vinaya Vidheya Rama Runtime
2018-11-16 10:03:55

మెగాస్టార్ ఓ సినిమాకు సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చాడంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందంటారు. ఆయన జడ్జిమెంట్ కు చాలా వాల్యూ కూడా ఉంటుంది. ఆ కారణంగానే తను, తన తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు స్టార్ లు కావడానికి కారణమైంది. కాకపోతే ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది కాబట్టి కొత్త తరానికి పర్ఫెక్ట్ స్టోరీస్ చెప్పడం లేదు కానీ.. విన్నవాటిలో మార్పులు చేయడంలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అంటారు. మొత్తంగా ఇప్పుడు తనయుడు రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘వినయ విధేయ రామ’ విషయంలో బోయపాటి వ్యవహారంపై మెగాస్టార్ గుర్రుగా ఉన్నాడని చెబుతున్నారు.

వినయ విధేయ రామ టాకీ పార్ట్ మాగ్జిమం పూర్తి చేసుకుంది. దీంతో ప్రొడక్షన్ పూర్తయినంత వరకూ రఫ్ కట్ చేయించి మూడు గంటల నిడివి ఉన్న సినిమాను చిరంజీవికి చూపించాలనుకుంటున్నాడు బోయపాటి. కాకపోతే బోయపాటి ఈ సినిమా నిడివిని మూడు గంటల పాటు ఉంచాలనుకుంటున్నాడు. తను తీసిందంతా ఖచ్చితంగా ప్రేక్షకులకు చూపించాలనే పట్టుదలతో ఉన్నాడట. అంతేకాక.. ఈ విషయంలో ‘ఎవరు చెప్పినా’ వినను అని తన స్టైల్లో ఛాలెంజ్ లు కూడా చేస్తున్నాడట. ఈ విషయం తెలిసిన చిరంజీవి బోయపాటిపై ఫైర్ అయ్యాడని టాలీవుడ్ టాక్. అసలు ఓ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కు అంత నిడివి అవసరం లేదని ముందు చెప్పి చూశాడట చిరు. కానీ బోయపాటి తను ఏం చూపించినా చూస్తారు ప్రేక్షకులు అని మొండిగా వాదించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఆ తర్వాతే చిరంజీవి బోయపాటిపై చాలా సీరియస్ అయ్యాడట. చెప్పింది వినకపోతే సీరియస్ గా ఉంటుందని కూడా హెచ్చరించాడట. దీంతో నిడివిలో కనీసం 25 నుంచి 30 నిమిషాలు తగ్గించేందుకు ‘సరే’ అన్నాడట బోయపాటి. ఏదేమైనా బోయపాటిది ఎప్పుడూ కాస్త అత్యుత్సాహమే. అందుకే సినిమా సినిమాకు మధ్య అంత గ్యాప్ ఉంటుంది.

More Related Stories