English   

ఫిల్మ్ జర్నలిస్టుల సాయాన్ని మెచ్చుకున్న చిరంజీవి...

TFJA Chiranjeevi.jpg
2020-04-07 23:05:25

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్ జర్నలిస్టులను ఆదుకునేందుకు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోషియేషన్ తీసుకున్న బృహత్తర కార్యక్రమానికి అందరి నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సినిమా జర్నలిస్టుల కుటుంబం అంతా ఒక్కటిగా నిలుస్తున్నారు. ఇప్పటికే 35 మంది జర్నలిస్టులకు నెలసరి సరిపడా సరుకులను అందచేసారు సభ్యులు. మరికొందరికి కూడా ఈ సాయం అందేలా చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు కూడా అందరికీ అందరం సాయం చేసుకుందామని చెబుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులు చేసిన సాయాన్ని చిరంజీవి కూడా గుర్తించాడు. ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ప్రశంసించారు కూడా. సోదర సమానలైన జర్నలిస్టు మిత్రులు చేసిన కార్యక్రమం గురించి విన్నాను.. అద్బుతంగా అనిపించింది.. ఈ సమయంలో అందరికి తోడుగా ఉందామంటూ ఆయన ట్వీట్ చేసాడు. 

More Related Stories