English   

బాల‌య్య‌ను హెల్ప్ అడిగిన చిరంజీవి

balakrishna-Chiru

టాలీవుడ్ నుంచి మీడియాపై యుద్ధం ముమ్మురం కాబోతోందా..? వీళ్లు నిజంగానే మీడియాను బాయ్ కాట్ చేయ‌బోతున్నారా..? ఇందుకోసం హీరోలంతా ఏకంగా కాబోతున్నారా..? అంటే అవున‌నే వినిపిస్తోంది. లేటెస్ట్ గా టాలీవుడ్ లో జ‌రుగుతోన్న ప‌రిణామాలు కొత్త‌గా ఉన్నాయి. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌నంతగా ఉన్నాయి. ఏ ప‌రిశ్ర‌మా మీడియా చూపించ‌నంత కొత్త‌గా ఉన్నాయి. మొత్తంగా మెగా ఫ్యామిలీ ఎంట్రీతో ఇండ‌స్ట్రీ వ‌ర్స‌స్ మీడియా అనే షురూ అయిపోయింది. మొద‌ట్లో ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోలేదు. అఫ్ కోర్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను శ్రీ రెడ్డి ఆమాట అన‌డాన్ని అంద‌రూ ఖండించారు. ఇది అంత‌టితో అయిపోయింద‌నుకున్నారు. కానీ అలా అయిపోనివ్వాల‌నుకోవ‌డం లేదు మెగా ఫ్యామిలీ. త‌మ మాట మీద ఇండ‌స్ట్రీ అంతా నిల‌వాల‌నుకుంటోంది. ఇందుకోసం ఇప్ప‌టి వ‌ర‌కూ కామ్ గా ఉన్న చిరంజీవి బ‌రిలోకి దిగాడు. అంతే కాదు.. ఈ విష‌యంపై మాట్లాడాల‌ని.. ఏకంగా త‌నే స్వ‌యంగా బాల‌య్య‌కు ఫోన్ చేసి పిలిపించాడు. ఇవాళ సాయంత్రం అన్న‌పూర్ణ స్టూడియోలో బాల‌య్య‌, చిరంజీవి భేటీ ఉంది. ఈ భేటీలో చిరంజీవి,, బాల‌య్య‌ను మీడియా బాయ్ కాట్ స‌హ‌క‌రించాల‌ని కోర‌బోతున్నాడు అనేది టాక్. కానీ వాళ్లు చెబుతోన్న మీడియా సంస్థ‌ల‌న్నీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయి. మ‌రి బాల‌య్య ఒప్పుకుంటాడా అనేది ప్ర‌శ్నే. ఒప్పుకున్నా అది ఇండ‌స్ట్రీ వ‌ర‌కే ప‌రిమితం అవుతుంద‌నుకోలేం. బాల‌య్య ఎమ్మెల్యే కూడా. కాబ‌ట్టి ఆయ‌న నిర్ణ‌యం ఏదైనా మీడియా, టిడిపి రిలేష‌న్ పై ప్ర‌భావంచూపుతుంది. అందువ‌ల్ల ఆయ‌న ఒప్పుకుంటాడా లేదా అనేది ప‌క్క‌న బెడితే అస‌లు చిరంజీవి ఆయ‌న్ని పిల‌వ‌డం.. ప్ర‌స్తుత ఇండ‌స్ట్రీ ప‌రిణామాల‌పై చ‌ర్చించాల‌నుకోవ‌డం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ భేటీ ముఖ్య ఉద్దేశాల్లో ఒక‌టి.. మీడియా పవ‌న్ క‌ళ్యాణ్ కు సారీ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం. అది సాధ్య‌మ‌వుతుందా అనేది డౌటే. మ‌రోవైపు ఈ విష‌యానికి బాల‌య్య స‌పోర్ట్ చేస్తాడా అనేదీ డౌటే. అయితే ఇవాళ బాల‌య్య‌తో చిరంజీవి భేటీ ముగిసిన త‌ర్వాత వీరి డిస్క‌ష‌న్స్ పాజిటివ్ గా ముగిస్తే మాత్రం మ‌రికొన్ని గంట‌ల్లో ఇండ‌స్ట్రీలోని టాప్ హీరోల నుంచి స్మాల్ హీరోల వ‌ర‌కూ మొత్తంగా ఓ పాతిక‌మంది హీరోల‌కు ఫోన్ వెళ్ల‌బోతోంద‌ని స‌మాచారం. ఈ హీరోలంతా కూర్చుని ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. దాన్ని బ‌ట్టి మీడియాక స‌హ‌క‌రించాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకునే చాన్సుంది. మొత్తంగా మెగా ఫ్యామిలీ త‌మ వ‌ర‌కూ వ‌చ్చేసరికి దీన్ని పంతంగా మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. కొంద‌రు మాత్రం బాల‌య్య‌తో క‌లిసి చిరంజీవి ఈవిష‌యానికో ఫుల్ స్టాప్ ప‌డేలా.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా స‌రైన ప‌రిష్కారం వ‌చ్చేలా చూడాల‌నే ప్ర‌య‌త్నిస్తున్నాడు అంటున్నారు. ఇందులో ఏది నిజ‌మో కానీ.. చిరంజీవి.. బాల‌య్య భేటీ మాత్రం టాలీవుడ్ లో హాట్ హాట్ గా డిస్క‌ష‌న్స్ లో ఉంది. 

More Related Stories