English   

మాజీ కేంద్ర‌మంత్రి మృతి ప‌ట్ల మెగాస్టార్ సంతాపం

Chiranjeevi
2021-05-06 13:53:07

మాజీ కేంద్ర‌మంత్రి ఆర్ఎల్డీ పార్టీ నేత చౌద‌రి అజిత్ సింగ్ 82 క‌రోనాతో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు అజిత్ సింగ్ అమెరికాలో 15 ఏళ్ల‌పాటు కంప్యూట‌ర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేశారు. 1986లో మొద‌టి సారి ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అంతే కాకుండా ఏడుసార్లు అజిత్ ఎంపీగా ఎన్నికయ్యారు. విజి సింగ్ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు. 

ఇక రాజ‌కీయ జీవితంలో ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచిన అజిత్ సింగ్ కరోనాతో మృతి చెంద‌డంతో ప‌లువురు ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా సినీ న‌టుడు చిరంజీవి అజిత్ సింగ్ మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు అజిత్ సింగ్ తో క‌లిసి ఆయ‌న పనిచేసిన‌ట్టు చిరంజీవి తెలిపారు. 

వ్య‌వ‌సాయ‌శాక మంత్రిగా, విమానయాన మంత్రిగా అజిత్ సింగ్ ఎన్నో సేవ‌లు అందించార‌ని చెప్పారు. అంతే కాకుండా రైతుల‌కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వహించార‌ని మెగాస్టార్ కొనియాడారు. ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు భారీ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి అజిత్ సింగ్ అని తెలిపారు. అజిత్ సింగ్ మృతి ప‌ట్ల మెగాస్టార్ సంతాపం తెలుపుతూ..ఆయ‌న ఆత్మ‌శాంతించాల‌ని కోరుకున్నారు. 

More Related Stories