English   

పాలిటిక్స్ కు చిరు ఇక సెల‌వు.. 

Chiranjeevi-politics
2018-03-06 08:40:33

అవును.. రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ఇవ్వ‌బోతున్నాడు చిరంజీవి. రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉన్నాడు చిరంజీవి. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత త‌ను రాజ‌కీయంగా చేసేది కూడా ఏం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు మెగాస్టార్. దాంతో ఇప్పుడు అన్న‌య్య‌ రాజ‌కీయ నాయ‌కుడు నుంచి మెగాస్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150తో ర‌ప్ఫాడించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డితో బిజీగా ఉన్నాడు చిరు. ఇదిలా ఉంటే రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టించ‌బోతున్నారు చిరంజీవి. అదేంటి.. తాను రాజ‌కీయాల్లో ఉంటాన‌ని.. అవ‌స‌రం అయిన‌పుడు క‌చ్చితంగా పార్టీకి సేవ చేస్తాన‌ని చెప్పారు క‌దా అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. చిరు ప్ర‌స్తుతం హీరోతో పాటు ఎంపి కూడా. ఈ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఈ ఎప్రిల్ 2తో పూర్తి కానుంది. అంటే రాజ‌కీయాల‌తో పూర్తిగా విముక్తుడు అయిపోతాడు చిరు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇష్ట‌ముంటే పాలిటిక్స్ వైపు వెళ్తాడు.. లేదంటే హాయిగా సినిమాలు చేస్తాడు. మొత్తానికి ఇప్పుడు త‌న భుజాల‌పై ఉన్న రాజ్య‌స‌భ భారాన్నైతే ఎప్రిల్ తో దించేస్తున్నాడు మెగాస్టార్. అదీ లెక్క‌..!   

More Related Stories