English   

 చిరంజీవి చిన్నకూతురుతో పెద్ద సాయం చేశాడు

Chiranjeevi-Subhashini
2018-04-26 08:54:34

చిరంజీవిలో హ్యూమానిటీ గురించి అదరికీ తెలుసు. ఇన్నాళ్లూ చాలా వరకూ ఆయన చాలా గుప్తదానాలు చేశాడని చెబుతారు. అయితే లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే మాత్రం ఆయన తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు వైద్యపరమైన ఇబ్బందులు పడితే వెంటనే స్పందిస్తున్నాడు. కాకపోతే ఆ విషయం ఆయన వరకూ వెళ్లాలి. ఆ మధ్య గుండు హనుమంతరావు హాస్పిటల్ లో ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ ను పంపించి అవసరమైన వైద్య ఖర్చుల కోసం డబ్బును అందించాడు. కాకపోతే అప్పటికే వ్యాధి ముదరడంతో గుండు హనుమంతరావు కాలం చేశారు. ప్రస్తుతం మరో సీనియర్ నటి అల్లరి సుభాషిణి క్యాన్సర్  తో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తన చిన్న కూతురు శ్రీజను స్వయంగా సుభాషిని ఇంటికి పంపించి రెండు లక్షల ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు మెగాస్టార్.  సుభాషిని చాలాకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. తన కష్టాల గురించి కొన్నాళ్ల క్రితం ఓ యూ ట్యూబ్ చానల్ లో కూడా పంచుకున్నారు. అప్పుడు కొందరు తోటి నటులు కొంత సాయం చేశారు. కానీ క్యాన్సర్ కావడంతో పాటు, రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉండటంతో ఖర్చు పెరిగిపోతోంది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించాడు. ఏదేమైనా ఇప్పుడు దాసరి లేని లోటును చిరంజీవి మాత్రమే తీర్చగలడు అన్న మాటను నిజం చేస్తూ తాను రియల్ లైఫ్ లోనూ అన్నయ్యనే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. జై చిరంజీవా.. 

More Related Stories