English   

చిరంజీవి ఇంట్లో నలుగురికి కరోన పాజిటివ్

chiranjeevi
2020-08-08 09:25:33

నిన్న పోలీసులు ప్లాస్మా డొనేషన్ చేసిన వారికి చేసిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన ఇంట్లో పని చేసిన నలుగురికి కరోనా సోకిందని చెప్పి షాకిచ్చాడు. అయితే అది కుటుంబ సభ్యులకి కాదు వారింట్లో పనివారికి. తమ ఇంట్లో వంట మనిషి శ్రీను.. స్విమ్మింగ్ పూల్ కడిగే లక్ష్మణ్.. అలాగే కూరగాయలు తరిమే ఆమె.. వంట మనిషి కొడుకుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. నెలన్నర రోజుల కిందే వాళ్లకు నయం అయిపోయిందని కరోనా సోకిందని తెలిసిన వెంటనే వాళ్లను క్వారంటైన్‌కు పంపించామని చెప్పుకొచ్చారు. మళ్ళీ వాళ్లకు రెండు సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత వచ్చి మళ్లీ తమ ఇంట్లో పని చేసుకుంటున్నట్లు చెప్పాడు ఆయన. వాళ్లు కూడా వచ్చి ప్లాస్మా డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారని అన్నారు. అలాగే తమకు తెలిసిన బంధువుల అబ్బాయికి కూడా కరోనా వచ్చిందన్న ఆయన డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కేవలం ప్లాస్మా వలనే ఆయన బ్రతికాడని చెప్పుకొచ్చారు చిరంజీవి.  

More Related Stories