English   

చిరంజీవి మరీ ఇలా అయిపోయాడేంటి.. క్వాలిటీ ఎక్కడ..

Chiranjeevi
2020-09-19 09:03:52

ఈ రోజుల్లో ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలంటే బడ్జెట్ 30 నుంచి 40 కోట్ల వరకు అవుతుంది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో సినిమా అంటే ఎంత కాదనుకున్నా కనీసం 70 నుంచి 80 కోట్ల మధ్యలో బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ కూడా అలాగే ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పుడు తన రేంజ్ తనే తగ్గించుకుంటున్నాడు. దాన్ని జాగ్రత్త అనాలా లేదంటే బడ్జెట్ తగ్గించడం కోసం తన క్వాలిటీ తగ్గించుకుంటున్నాడా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు అనుకోవచ్చు. దీనికి నిదర్శనం మన కళ్లముందు కనిపిస్తుంది. 

ఉదాహరణకు ఇప్పుడు వేదాళం రీమేక్ తీసుకుందాం.. ఈ సినిమాకు దర్శకుడిగా మెహర్ రమేష్ ను తీసుకున్నాడు చిరంజీవి. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ ఇక రెమ్యూనరేషన్ అవసరం లేదు. అలా అక్కడ దర్శకుడు ఖర్చు మిగిలిపోయింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ను ఎంచుకున్నాడు. చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాకు మహతి లాంటి అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కూడా బడ్జెట్ తగ్గించేసాడు చిరంజీవి.

అంతేకాదు ఈ సినిమాకు పని చేస్తున్న మిగిలిన టెక్నీషియన్స్ కూడా చిన్నవాళ్లే అని తెలుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో వేదాళం రీమేక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. 
దీనికి అనిల్ సుంకర, రామ్ చరణ్ నిర్మాతలు. తన రెమ్యూనరేషన్ కాకుండా కేవలం 25 కోట్ల లోపు సినిమా పూర్తి చేస్తే లాభాలు వస్తాయని ప్లాన్ చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ విషయంలో కూడా చిరంజీవి ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నాడు. అలా ఈ రెండు రీమేక్ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్తో పూర్తిచేసి లాభాలు అందుకోవాలని చూస్తున్నాడు. ఎలాగూ సూపర్ హిట్ కథలు కాబట్టి రిస్కు కూడా తక్కువే. ఏదైనా చిరంజీవి లాంటి హీరో ఇలా ఆలోచించడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. 

More Related Stories