English   

‘‘ఎన్టీఆర్’’ చిరంజీవి కూడా ఉన్నాడా..?

Chiranjeevi-NTR-Biopic
2018-08-11 19:04:44

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకోవార్త షికారు చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న హాటెస్ట్ న్యూస్ ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంటుందని. యస్.. మీరు చదివింది నిజమే. అవును ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా ప్రస్తావించబోతున్నాడట దర్శకుడు క్రిష్. ఇందుక సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ లో కూడా ఖచ్చితమైన స్పేస్ ఉందంటున్నారు. 

ఇక ఎన్టీఆర్, చిరంజీవిల మధ్య అనుబంధం గురించి మాట్లాడితే అందరికీ తెలిసి ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఒకటే. అదే తిరుగులేని మనిషి. ఇందులో గిరజాల జుట్టుతో చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి స్క్నీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే చిరంజీవికి ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. కొండవీటి సింహం సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో మోహన్ బాబు పాత్రలో ముందుగా అనుకున్నది చిరంజీవినే. కాస్త నెగెటివ్ టచ్ తో సాగే పాత్ర అది. అప్పటికే చిరంజీవి కొన్ని నెగెటివ్ రోల్స్ చేసి ఉన్నాడు. అందుకే దర్శకుడు రాఘవేంద్రరావు చిరంజీవిని తీసుకున్నాడు. కానీ షూటింగ్ లో చిరు.. ఎన్టీఆర్ ను చూసి భయపడ్డాడట. 

ఒక సీన్ లో కొడుకును మందలిస్తుంటాడు ఎన్టీఆర్. కానీ ఆయన డైలాగ్స్ చూసి చిరంజీవి కాస్త భయపడ్డారట. అంటే నటించడానికి కాదు.. ఎన్టీఆర్ వంటి నటుడుతో చేస్తున్నాను అన్న ఫీలింగ్ తో.. దీంతో ఎక్కువ టేకులు పడ్డాయి. ఇన్ని టేక్స్ ఏ ఆర్టిస్ట్ తీసుకున్నా ఎన్టీఆర్ కు నచ్చదు.దీంతో చిరంజీవిని వద్దన్నారట. కానీ దర్శకుడు కాస్త రిక్వెస్ట్ చేసి చిరంజీవిని ప్రిపేర్ చేసి నెక్ట్స్ డే షూటింగ్ కు తీసుకువచ్చాడు. కానీ సేమ్ సిట్యుయేషన్. దీంతో చిరును తొలగించి మోహన్ బాబును తీసుకున్నారా పాత్రలో. తర్వాత చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిన విధానం అంతా ఎన్టీఆర్ కళ్లముందే జరిగింది. సో.. ఇలాంటి ఫన్నీ సీన్స్ పెడితే ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుంది.. మరి నిజంగానే  చిరంజీవి పాత్ర ఉంటుందా..? ఉంటే ఆ పాత్రలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. 

More Related Stories