English   

మెగాస్టార్ కోసం తమిళ హిట్ సినిమాని రీమేక్ చేస్తోన్న మెహర్ రమేష్

Chiranjeevi
2020-08-07 09:40:48

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే మెగాస్టార్ మరో రీమేక్ మీద కన్నేసినట్టు చెబుతున్నారు. అజిత్ హీరోగా తెర‌కెక్కిన త‌మిళ మూవీ వేదాళమ్‌ అక్కడ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి కలెక్షన్స్ ని వ‌సూలు చేయడమే కాక మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేసేందుకు చిరంజీవి సిద్దమైన‌ట్టు చెబుతున్నారు. మెహ‌ర్ ర‌మేష్ కు ఈ సినిమా స్క్రిప్ట్ బాధ్యత‌ల‌ను అప్పగించినట్టు చెబుతున్నారు. దీనిని కేఎస్ రామారావుకు చెందిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.  

More Related Stories