English   

చిరంజీవి డ‌బుల్ గేమ్ ఆడుతున్నాడా..?

Chiranjeevi is playing a double game
2018-06-04 06:42:57

స‌్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా అన్న‌పుడు స్టార్ హీరోల‌కు కూడా అప్పుడ‌ప్పుడూ కొన్ని తిప్ప‌లు త‌ప్ప‌వు. గ‌తేడాది మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ కూడా ఓ వైపు స్పైడ‌ర్ చేస్తూనే మ‌రోవైపు కొర‌టాల‌తో భ‌ర‌త్ అనే నేను షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు మ‌రోసారి కొర‌టాల శివ కోస‌మే మ‌రో స్టార్ హీరోకు ఇలాంటి తిప్ప‌లు త‌ప్పేలా లేవు. ఆయ‌న మరెవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈయ‌న ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ 5 నుంచి కొత్త షెడ్యూల్ జ‌రుపుకోనుంది. నెల రోజుల పాటు జ‌రిగే భారీ షెడ్యూల్ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇందులో చిరంజీవితో పాటు విజ‌య్ సేతుప‌తి, అమితాబ్, సుదీప్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి స్టార్ క్యాస్ట్ అంతా పాల్గొన బోతున్నారు. ఈ షెడ్యూల్ తో సైరా షూటింగ్ దాదాపు స‌గం పూర్త‌యిన‌ట్లే. ఇదిలా ఉంటే ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే కొర‌టాల శివ‌తోనూ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు మెగాస్టార్. 

ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించాడు మెగాస్టార్. ఇప్పుడు కొర టాల ఇదే ప‌నిమీద బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తుంది. మ‌రీ ఏడాది పాటు కొర‌టాల‌ను వెయిట్ చేయించ‌డం బాగోద‌ని భావించిన చిరు.. అన్నీ కుదిర్తే అక్టోబ‌ర్ నుంచే కొర‌టాల సినిమా మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు. ఒకేసారి అటు సైరాతో పాటే ఇటు కొర‌టాల సినిమా షూటింగ్ లోనూ పాల్గొనాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇలా చేయ‌డం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. సైరాలో చిరు గ‌డ్డం.. జుట్టుతో క‌నిపిస్తాడు. అదే లుక్ ఇక్క‌డా ఉండాల‌ని లేదు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా సైరా టాకీ పూర్తి చేసి కొర‌టాల కోసం వ‌చ్చేయాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. మ‌రి చూడాలిక‌.. ఆ సినిమా ఎప్పుడు పూర్త‌య్యేనో.. కొర‌టాల కోసం మెగాస్టార్ ఎప్పుడు వచ్చేనో..? 

More Related Stories