English   

చిరంజీవి అల్లుడు చింపేశాడుగా..?

Kalyan-Dev

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మారిన సంగతి తెలుసు కదా.. వారాహి చలన చిత్రబ్యానర్ కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తోంది. గతంలో జతకలిసే అనే చిత్రాన్ని రూపొందించిన రాకేశ్ శశి ఈ మూవీకి డైరెక్టర్. మొత్తంగా కొన్నాళ్ల క్రితం సాధారణంగా ఏ హడావిడీ లేకుండా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చింది. చాలా వేగంగా, సైలెంట్ గా సినిమా షూటింగ్ పూర్తయిపోయిందట. యస్.. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ కూడా చెబుతున్న ఫోటోస్ ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది యూనిట్. కుర్రాడి స్పీడ్ చూసి చాలామంది స్పీడ్ తో చింపేస్తున్నాడుగా అంటున్నారు.. కళ్యాణ్ దేవ్ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోందీ మూవీ. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మెరిసిన అప్పటి టీనేజ్ బ్యూటీ మాళవిక నాయర్, కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది యూనిట్. మొత్తంగా ఈ కుర్రాడు మెగా హీరోల సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ఫిలిమ్ నగర్ టాక్. ఒకవేళ ఇతను వద్దన్నా వాళ్లు ఊరుకోరు కదా. చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉన్న కళ్యాణ్ యాక్టింగ్ లో టాలెంట్ కూడా చూపిస్తే కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో రాణించగలడు.. ఏదేమైన ఇంత స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేయడమే కాక.. డబ్బింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూ వెళ్లిపోయిన ఈ మూవీ టీమ్ ను చూస్తే భలే ఆశ్చర్యంగా ఉందిలే.. 

More Related Stories