English   

దేవుడు శాసించాడు.. చిరు అనుభవించాడు..

Chiranjeevi King Of Telugu Film Industry Zero in Politics
2018-08-22 09:46:17

ఈ రెండు ఇప్పుడు చిరంజీవికి ప‌క్కా సూట్ అయ్యే ప‌దాలే. ఎందుకంటే ఇండియ‌న్ సినిమాలో చిరంజీవి కంటే కింగ్ ఎవ‌రూ లేర‌ని అమితాబ్ బ‌చ్చ‌న్ చెప్పారు. ఇక ఈయ‌న‌లో ఓ ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కు క‌నిపిస్తార‌ని బాల‌చందర్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు. ఇక చిరంజీవి కూడా సినిమా అనేది త‌న సొంత గ్రౌండ్ అని.. ఇక్క‌డ త‌న ఆట తాను ఆడుకోవ‌చ్చ‌ని చెప్తాడు. కానీ అనుకోకుండా త‌నకు అల‌వాటు లేని రాజ‌కీయాల్లోకి వెళ్లాడు చిరంజీవి. ఇష్టం లేకుండానే అక్క‌డే ప‌దేళ్లు ఉన్నాడు. ఇప్ప‌టికీ ఉన్నాడు కానీ యాక్టివ్ గా కాదు. ఇక ఇప్పుడు వీటికి పూర్తిగా సెల‌వు ఇచ్చేయాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్.

అవును.. రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ఇవ్వ‌బోతున్నాడు చిరంజీవి. రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉన్నాడు చిరంజీవి. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత త‌ను రాజ‌కీయంగా చేసేది కూడా ఏం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు మెగాస్టార్. దాంతో ఇప్పుడు అన్న‌య్య‌ రాజ‌కీయ నాయ‌కుడు నుంచి మెగాస్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150తో ర‌ప్ఫాడించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డితో బిజీగా ఉన్నాడు చిరు. ఇదిలా ఉంటే రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టించ‌బోతున్నారు చిరంజీవి. అదేంటి.. తాను రాజ‌కీయాల్లో ఉంటాన‌ని.. అవ‌స‌రం అయిన‌పుడు క‌చ్చితంగా పార్టీకి సేవ చేస్తాన‌ని చెప్పారు క‌దా అనుకుంటున్నారా..?

కాంగ్రెస్ కు అవ‌స‌రం అనిపించిన‌పుడు కూడా బ‌య‌టికి రావ‌డం లేదు చిరంజీవి. త‌న సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. మొన్న క‌ర్ణాట‌క‌లో కూడా ప్ర‌చారానికి రాలేదు. పైగా ఇప్పుడు ఈయ‌న ఎంపి కూడా కాదు. ఆ ప‌ద‌వికాలం కూడా పూర్తైపోయింది. దాంతో రాజ‌కీయాల‌కు పూర్తిగా విముక్తుడు అయిపోయాడు చిరు. ఇప్పుడు ఇష్ట‌ముంటే పాలిటిక్స్ వైపు వెళ్తాడు.. లేదంటే హాయిగా సినిమాలు చేస్తాడు. అందుకే వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ రాజ‌కీయాల గురించి పూర్తిగా మ‌రిచిపోతున్నాడు ఈ హీరో.

More Related Stories