English   

షాకింగ్.. RRR విడుదల రోజే చిరంజీవి, కొరటాల సినిమా..

Chiranjeevi Koratala Siva
2019-11-19 17:19:57

చిరంజీవి, కొరటాల శివ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు కూడా. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. దేవాలయం మాఫియా నేఫథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తుంది. అందుకే సింహాచలం గుడిని పోలిన భారీ సెట్ నిర్మిస్తున్నారు.. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు కొరటాల శివ. 

చాల ఏళ్ల క్రితం సింహాచలం ఆలయ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటనకు ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నట్లు తెలుస్తుంది. దేవాలయాలలో జరుగుతున్న అవినీతి మాఫియా లాంటి విషయాలను హైలెట్ చేస్తూ కొరటాల శివ ఈ కథను రాసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు మెగాస్టార్. 

దేవున్ని పెద్దగా నమ్మని కొరటాల.. ఇప్పుడు ఇలాంటి కథ తీసుకురావడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. స్టాలిన్ సినిమా తర్వాత 12 ఏళ్లు గ్యాప్ తీసుకుని త్రిషతో మరోసారి రొమాన్స్ చేయబోతున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. 

ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసింది. జులై 30న ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. ఆరోజు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి తన సినిమాని జూలై 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

More Related Stories