English   

రాజకీయాల‌కు చిరంజీవి సెల‌వు..

2017-04-01 07:46:35

చిరంజీవి ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడు కాదు.. మెగాస్టార్. ఆయ‌న మ‌ళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయారు. 2019 వ‌ర‌కు ఖాళీగానే ఉండాల్సి రావ‌డంతో మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చేసారు మెగాస్టార్. ఖైదీ నెంబ‌ర్ 150తో ర‌ప్ఫాడించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డి క‌థ‌తో బిజీగా ఉన్నాడు చిరు. ఇదిలా ఉంటే రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టించ‌బోతున్నారు చిరంజీవి. అదేంటి.. తాను రాజ‌కీయాల్లో ఉంటాన‌ని.. అవ‌స‌రం అయిన‌పుడు క‌చ్చితంగా పార్టీకి సేవ చేస్తాన‌ని చెప్పారు క‌దా అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ వినండి. చిరంజీవి ప్ర‌స్తుతం హీరోతో పాటు ఎంపి కూడా. ఈ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఈ జూన్ తో పూర్తి కానుంది. అంటే అప్పుడు రాజ‌కీయాల‌తో పూర్తిగా విముక్తుడు అయిపోతాడు చిరు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇష్ట‌ముంటే పాలిటిక్స్ వైపు వెళ్తాడు.. లేదంటే హాయిగా సినిమాలు చేస్తాడు. మొత్తానికి ఇప్పుడు త‌న భుజాల‌పై ఉన్న రాజ్య‌స‌భ భారాన్నైతే జూన్ తో దించేస్తున్నాడు మెగాస్టార్. అదీ లెక్క‌..!

More Related Stories