English   

 ఈ విజేతకు ఆ విజేత ప్రశంసలు..!!

chiranjeevi

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సినిమా విజేత. నిన్న విడుదలైన విజేతకు బాక్సాఫీస్ వద్దా విజేత అవుతాడనే టాక్ వచ్చింది. మొత్తంగా అల్లుడి ఫస్ట్ మూవీకి హిట్ టాక్ రావడం చిరంజీవికి చాలా ఆనందాన్నిచ్చింది. పైగా ఆయనకు చిన్న కూతురంటే చాలా ఇష్టం కూడా. అందుకే రెండో రోజే విజేత గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో చిరు మాట్లాడిన మాటలు చూస్తే ఆయనెంత ఆనందంగా ఉన్నాడో తెలుస్తుంది. ఒక రకంగా ఆ విజేత.. ఈ విజేతను పొగుడుతున్నట్టు అనిపించింది. అయితే చిరు మాటల్లో ఎక్కువగా మురళీ శర్మ గురించి చెప్పడం విశేషం. 

ఈ సినమాలో మురళీ శర్మను తీసుకోవాలని చెప్పింది కూడా ఆయనే. ఆయన మాట ఎంత నిజమో.. తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మురళీ శర్మ. తండ్రి పాత్రలో మురళీ కన్నీళ్లు పెట్టించాడు. అందుకే అవార్డులు నిజాయితీగా ఇస్తే గనక మురళీ శర్మకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ ఇవ్వాల్సిందే అంటూ గట్టిగా చెప్పడం విశేషం. ఒకరకంగా ఇది అవార్డ్ కమిటీకి చేసిన సిఫారసులా కూడా ఉంది. అయితే అతని నటనలో అంత ప్రతిభ ఉంది కాబట్టి.. చిరంజీవి సిఫారసు చేసినా ఫర్వాలేదు. మొత్తంగా విజేత విజయం చిరంజీవికి కొత్త ఆనందాన్నిచ్చిందనే చెప్పాలి.

More Related Stories