English   

తమ్ముడిలా ఆదరించారు...చిరు భావోద్వేగం!!

chiranjeevi
2019-02-12 10:33:37

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు(82) ఈ రోజు ఉద‌యం త‌న స్వ‌గృహంలో క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా బాపినీడు ఇంటికి వెళ్లి ఆయ‌న పార్ధివ దేహానికి నివాళులు అర్పింఛి వారి కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవి- బాపినీడు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఖైదీ నెం 786, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ సాధించాయి. ఈ సందర్భంగా బాపినీడుతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన అభిమానులకు కూడా విజయ బాపినీడు అంటే ఎంతో ఇష్టమని తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆయన తమ్ముడిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు.  మరోపక్క విజ‌య బాపినీడు మృతి ప‌ట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌, సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు కూడా సంతాపం వ్య‌క్తం చేశారు. బాపినీడు మ‌ర‌ణం త‌న‌నెంతో బాధించింద‌ని మోహ‌న్ బాబు అన్నారు. మ‌యూరి సంస్థ‌లో పని చేస్తున్న‌ప్ప‌టి నుండి ఆయ‌న‌తో సాన్నిహిత్యం ఉంద‌ని ఆయ‌న గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని దర్శకుడిగానే కాక ఆయన మంచి రచయిత, సంపాదకుడు అభిరుచి గల నిర్మాత అని పేర్కొన్నారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని మోహ‌న్ బాబు తెలిపారు. గురువారం రోజు విజ‌య‌ బాపినీడు అంత్యక్రియ‌లు మ‌హా ప్ర‌స్థానంలో జ‌ర‌ప‌నున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా గురువారం జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది.

More Related Stories