English   

మ్యాచింగ్ డ్రెస్సుల్లో సందడి చేసిన మెగాస్టార్, రామ్ చరణ్

 Chiranjeevi Ram Charan
2021-02-25 11:45:16

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెకుతున్న సినిమా "ఆచార్య".ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ జగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో మెగాస్టార్, రామ్ చరణ్ లు వాళ్ళకి అభివాదం చేశారు. అయితే చరణ్, మెగాస్టార్ ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు ధరించి ఉన్నారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లతో తండ్రీ కొడుకులు కనిపిస్తున్నారు. ఇద్దరు హీరోలను ఒకే సారి చూసిన స్థానికులు ముచ్చట పడుతున్నారు. ఇక ప్రస్తుతం చరణ్ మెగాస్టార్ ల ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరిన  ఆచార్య సినిమా మే 13 న విడుదల కానుంది.

More Related Stories