ఆచార్య చేతుల మీదుగా విరాటపర్వం టీజర్ విడుదల

రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. రెవల్యూషన్ ఈజ్ ఆన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా విప్లవం, ప్రేమ అనే కథ తో రానుంది. ఈ చిత్రంలో నటి ప్రియమణి, నవీన్ చంద్ర కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా కోలో కోలో అని సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ముందుగానే ప్రకటించినట్టుగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసారు. ఇక ఈ టీజర్ ఆసక్తి రేకెత్తించేవిధంగా ఉంది. టీజర్ లో విప్లవం..ప్రేమ అనే అంశాలను సినిమాలో ఆసక్తిగా పించారు. అంతే కాకుండా టీజర్ లో వచ్చే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. "చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ ఆమెది" అంటూ వచ్చే డైలాగ్స్ చూస్తుంటే సినిమాలో విప్లవానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రేమ కు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ఎప్రిల్ 30 న విడుదల కానుంది. సినిమా నుండి విడుదలైన టీజర్..పాటలు బాగుండటం తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.