English   

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై చిరంజీవి స్పందన..

Chiranjeevi
2019-12-07 14:57:25

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దారుణం జరిగిన పది రోజుల్లోనే పోలీసులు వాళ్ళని చంపేయడం సెన్సేషన్ అయిపోయింది. దీనిపై చాలా మంది తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎన్కౌంటర్ చేయకుండా కోర్టు ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనిపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. 

మెగాస్టార్ చిరంజీవి కూడా దిశ నిందితుల ఎన్కౌంటర్ మీద మాట్లాడాడు. ఈయన ఒక్కడు మాట్లాడితే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడినట్టే అంటూ ఈ మధ్య దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చాడు. ఇక దిశా నిందితులను పోలీసులు చంపేసిన వెంటనే తెలుగు ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, పవన్, మంచు మనోజ్, రకుల్, నాని… అందరూ సోషల్ మీడియాలో స్పందించారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు. దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందేనని మెగాస్టార్ అన్నారు. ఏదేమైనా కూడా దిశ ఉదంతం అంతా మళ్లీ ఇలాంటి దారుణాలు రిపీట్ కాకుండా చూసేలా ఉంటే అంత కంటే ఎవరు కోరుకునే న్యాయం మరొకటి లేదు.

More Related Stories