English   

ఇక రాజ‌కీయాలు చాలంటోన్న చిరు.. 

Chiranjeevi

అవును.. రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ఇవ్వ‌బోతున్నాడు చిరంజీవి. రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్లుగానే ఉన్నాడు చిరంజీవి. కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత త‌ను రాజ‌కీయంగా చేసేది కూడా ఏం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు మెగాస్టార్. దాంతో ఇప్పుడు అన్న‌య్య‌ రాజ‌కీయ నాయ‌కుడు నుంచి మెగాస్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150తో ర‌ప్ఫాడించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డితో బిజీగా ఉన్నాడు చిరు. ఇదిలా ఉంటే రాజ‌కీయాల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టించ‌బోతున్నారు చిరంజీవి. అదేంటి.. తాను రాజ‌కీయాల్లో ఉంటాన‌ని.. అవ‌స‌రం అయిన‌పుడు క‌చ్చితంగా పార్టీకి సేవ చేస్తాన‌ని చెప్పారు క‌దా అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. చిరు ఇన్నాళ్లు హీరోతో పాటు ఎంపి కూడా. అంటే ఎక్క‌డో ఓ మూల ఇంకా రాజ‌కీయ నాయ‌కుడే. ఇప్పుడు ఈ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసింది. మార్చ్ 28 ఈయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి చివ‌రిరోజు. అంటే రాజ‌కీయాల‌తో పూర్తిగా విముక్తుడు అయిపోతాడు చిరు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇష్ట‌ముంటే పాలిటిక్స్ వైపు వెళ్తాడు.. లేదంటే హాయిగా సినిమాలు చేస్తాడు. మొత్తానికి ఇప్పుడు త‌న భుజాల‌పై ఉన్న రాజ్య‌స‌భ భారాన్నైతే దించేసుకున్నాడు మెగాస్టార్. అదీ లెక్క‌..!     

More Related Stories