English   

ఎన్టీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ ఆరా

Chiranjeevi
2021-05-12 17:35:12

టాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. రోజు రోజుకు క‌రోనా బారిన ప‌డుతున్న సెల‌బ్రెటీల సంఖ్య పెర‌గుతోంది. ఇప్ట‌టికే పలువురు క‌రోనా బారిన ప‌డి మృతి చెంద‌గా మ‌రికొంద‌రు కోలుకున్నారు. ఇక మ‌రికొంద‌రు ప్ర‌స్తుతం క‌రోనా కు చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్న వారిలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ చేసారు. "కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారన్టైన్ లో ఉన్నారు. తారక్ మరియు ఆయన కుటుంబ సభ్యులు బాగున్నారు. తను చాలా ఎనర్జిటిక్ గా ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. త్వరలోనే కొలుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతున్న అభిమానుల‌కు మెగాస్టార్ ట్వీట్ కాస్త ఊర‌ట‌నిచ్చింది. మ‌రోవైపు ప‌దిహేను రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన అల్లు అర్జున్ క‌రోనా నుండి కోలుకున్నారు.

More Related Stories