English   

మెగాస్టార్ నోట ప‌వ‌ర్ స్టార్ మాట‌..

Chiranjeevi Speaks About Pawan's Attarintiki Daredi at Geetha Govindam Event
2018-08-20 08:52:12

చిరంజీవి మ‌రోసారి త‌మ్మున్ని త‌లుచుకున్నారు. ఈ మ‌ధ్య రాజ‌కీయాలు కాద‌ని పూర్తిగా సినిమాల‌తోనే బిజీగా ఉన్న మెగాస్టార్.. ఇప్పుడు గీత గోవిందం స‌క్సెస్ మీట్ కు వ‌చ్చాడు. సైరా షూటింగ్ ను కూడా ఆపుకుని మ‌రీ ఈ వేడుక‌కు వ‌చ్చాన‌ని చెప్పాడు చిరంజీవి. అయితే వ‌ర్షం కార‌ణంగా ఈ షెడ్యూల్ కు కూడా కొన్ని తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే కార‌ణంతోనే షూట్ ఆల‌స్య‌మైంది. రాత్రిపూట షూటింగ్స్ కావ‌డం చిరంజీవికి క‌లిసొచ్చే అంశం.

అందుకే వ‌చ్చి స‌క్సెస్ మీట్ చూసుకుని మ‌ళ్లీ షూటింగ్ కు వెళ్లిపోవ‌చ్చు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు గీత‌గోవిందం స‌క్సెస్ మీట్ లో చిరంజీవి నోట ప‌వ‌న్ మాట వ‌చ్చింది. గీత‌గోవిందం ఇంత పెద్ద విజ‌యం సాధించినందుకు సంతోషంగా ఉంద‌ని.. అయితే విడుద‌ల‌కి ముందు అల్లు అర‌వింద్ ని ఓ సారి క‌లిసిన‌పుడు ఆయ‌న డ‌ల్ గా ఉండ‌టం చూసి షాక్ తిన్నాన‌ని చెప్పాడు చిరంజీవి. సినిమా బాగా రావ‌ట్లేదేమో అనుకున్నాన‌ని.. అయితే కార‌ణం అడిగితే లీకేజ్ ఇష్యూ గురించి చెప్పాడ‌ని గుర్తు చేసారు చిరంజీవి.

దాంతో ఆయ‌న‌కి ధైర్యం చెప్ప‌డానికి అప్ప‌ట్లో జ‌రిగిన అత్తారింటికి దారేది లీకేజ్ ఇష్యూ గురించి చెప్పాన‌ని చెప్పాడు మెగాస్టార్. అది విడుద‌ల‌కు ముందే లీక్ అయింద‌ని.. కానీ ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసింద‌ని గుర్తు చేసాడు మెగాస్టార్. అదే ఈ సినిమాకు కూడా జ‌రుగుతుంది.. ధీమాగా ఉండండ‌ని ధైర్యం చెప్పాన‌న్నాడు చిరంజీవి. అయితే ఏదో అర‌వింద్ కు ధైర్యం చెప్ప‌డానికి అలా అన్నానే కానీ నిజంగా అలా సినిమా విడుద‌ల‌కు ముందు లీక్ చేయ‌డం అనేది దారుణం అని చెప్పారు మెగాస్టార్. కార‌ణం ఏదైనా అన్న‌య్య నోట త‌మ్ముడు గురించి రావ‌డంతో అక్క‌డ అభిమానులు గాల్లో గంతులేసారు.

More Related Stories