English   

మెగాస్టార్ సర్ప్రైజ్ కి మురిసిపోయిన ఉప్పెన బ్యూటీ

Chiranjeevi
2021-02-23 11:22:23

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో భాగమైన వారికి చిరు కానుకలు పంపి సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ కు మెగాస్టార్ సర్ప్రైజ్ ఇవ్వగా డిఎస్పీ ఆ గిఫ్ట్ మరియు లెటర్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఉప్పెన బ్యూటీ  కృతి శెట్టి సైతం మెగాస్టార్ పంపిన సర్ప్రైజ్ కు మురిసిపోతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మెగాస్టార్ గిఫ్ట్ తో పాటు కృతిశెట్టి కి ఒక అభినందన లెటర్ కూడా పంపించారు లెటర్ లో "బోర్న్ స్టార్" (పుట్టుక తోనే నటి) అంటూ కృతి శెట్టి పై ప్రశంసలు కురిపించారు. 

స్టార్ మాత్రమే కాదని..అద్భుతమైన నటి అంటూ ప్రశంసించారు. ఇక మెగాస్టార్ పంపిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రితి " చిరంజీవి గారికి థాంక్స్..ఈ లేఖ నా హృదయాన్ని హత్తుకుంది. మీ అందమైన బహుమతి బంగారం లాంటి మాటలు ఎప్పుడూ నా హృదయంలో నిలిచిపోతాయి." అంటూ పోస్ట్ లో ఆనందం వ్యక్తం చేసింది. ఇక మొదటి సినిమాతో ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ ను సంపాదించింది. ఉప్పెన సినిమా విడుదల కు ముందు పాటలతోనే కృతి కి అభిమానులయ్యారు. ఇక సినిమా విడుదల తరవాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయని..రామ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి.

More Related Stories