English   

మరికొన్ని గంటల్లోనే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ షురూ..

Chiranjeevi SyeRaa Narasimha Reddy Teaser Releasing in Few Hours
2018-08-20 16:41:54

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా వస్తోన్న ఈ సినిమా టీజర్ మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతోంది. మెగాస్టార్ బర్త్ డే ఈ నెల 22న అందుకు ఒక రోజు ముందుగానే అనగా 21న ఉదయం 11.30గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నారు. పొలిటికల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తర్వాత చిరంజీవి చేస్తోన్న రెండో సినిమా ఇది. ఖైదీ నెంబర్ 150తో మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించిన చిరంజీవి ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ వల్ల రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక మొన్నటి వరకూ ఈ సినిమా సంగీత దర్శకుడెవరా అనే సస్పెన్స్ ఉండేది. చాలామంది పేర్లు వినిపించిన తర్వాత ఫైనలర్ గా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేదిని ఫైనల్ చేశారు. సో ఇప్పుడు టీజర్ లో అతనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆధారంగా ఆయనెంత టాలెంటెడ్.. అతని సంగీతం ఈ సినిమాకు ప్లస్సా మైనస్సా అనేది తేలిపోతుంది.

సైరా నరసింహారెడ్డి హిస్టారికల్ మూవీ. అందుకే భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇక బయటి నిర్మాతలైతే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవుతారని రామ్ చరణే స్వయంగా నిర్మిస్తున్నాడీ చిత్రాన్ని. దీంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అలరించిన ఈ టీమ్ ఇప్పుడు టీజర్ తో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఓ కొత్త జోష్ నింపబోతున్నారు. అలాగే బిజినెస్ వర్గాల్లోనూ ఈ టీజర్ తో కొంత క్రేజ్ మొదలవుతుందనుకోవచ్చు. ఇక నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.  జగపతిబాబు, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

More Related Stories