English   

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..

chiranjeevi- Elections

రెండేళ్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు మెగాస్టార్. మ‌ళ్లీ అంద‌రివాడు అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఈయ‌న తీరు చూసి ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాజ‌కీయాల వైపు వెళ్ల‌డ‌నే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మెగాస్టార్ చూపులు మ‌ళ్లీ పాలిటిక్స్ వైపు ప‌డుతు న్నాయి. అది కావాల‌ని కాదు.. హై క‌మాండ్ ఆజ్ఞ‌తో ఏం చేయ‌లేక‌పోతున్నాడు చిరంజీవి. అమ్మ సోనియా ఆశీస్సుల‌తో చిరు క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్స్ కంపైన్ కు వెళ్ల‌నున్నారు. ఈ విష‌యం పార్టీ అధిష్టానం కూడా క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఈ ఎప్రిల్ లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు ముందే చిరంజీవి కాంగ్రెస్ త‌రఫున ప్ర‌చారం చేయ‌బోతున్నారు. అయితే కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే తాను ప్ర‌చారానికి వ‌స్తాన‌ని చెప్పాడు చిరంజీవి. అలాగే సినీనటి ఖుష్బూ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. 

అన్నభాగ్య, ఇందిరా క్యాంటీన్‌, తదితర సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష కానున్నాయని కాంగ్రెస్ బెంగ‌ళూర్ ప్ర‌తినిథి దినేశ్‌ గుండూరావు అభిప్రాయపడ్డారు. తమలో ఎలాంటి గ్రూపులు లేవని తేల్చిచెప్పిన ఆయన టికెట్‌ ఎవరికి దక్కినా నేతలంతా సమిష్టిగా విజయం కోసం కృషి చేస్తారన్నారు. త‌మ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు చిరంజీవి సినీ గ్లామ‌ర్ చాలా యూజ్ అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నాడాయ‌న‌. అయితే పాలిటిక్స్ కార‌ణంగా సైరా సినిమాకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి హైద‌రాబాద్ లోనే రెండో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నాడు చిరంజీవి. అది జ‌రుగుతుండ‌గానే వారం పాటు అలా వెళ్లి ఇలా వ‌చ్చేస్తాడు మెగాస్టార్. అంతేకానీ పూర్తిగా రాజ‌కీయాల‌కు మాత్రం ప‌రిమితం కావ‌ట్లేదు ఈయ‌న.

More Related Stories