English   

చిరంజీవి చేతుల మీదుగా సమ్మోహనం

Sudheer-Babu
2018-04-30 16:58:07

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సమ్మోహనం టీజర్ విడుదల కాబోతోంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితిరావు హైదరి జంటగా నటించిన చిత్రమే సమ్మోహనం. చాలా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మే1న మెగాస్టార్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయబోతోంది టీమ్. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. పెళ్లి చూపులుతో ఫేమ్ అయిన వివేక్ సాగర్ కథ నచ్చితే కానీ కమిట్ కాడనే పేరుంది. ఇక మోహన కృష్ణ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు. నానితో జెంటిల్మన్, అమీతుమీ చిత్రాలు కమర్షియల్ గా మంచి హిట్స్ గా నిలిచాయి. ఆకట్టుకునే టైటిల్స్ తో తెలుగుదనం నిండిన సెన్సిబుల్ స్టోరీస్ ను అందించడంలో మోహన కృష్ణ ఎక్స్ పర్ట్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీతో అదితి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించబోతోంది. చెలియాతో సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అదితికి ఈ మూవీ విడుదలకు ముందే మరో రెండు చాన్సులు రావడం విశేషం. ఇక కొన్నాళ్లుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న సుధీర్ బాబుకు ఈ చిత్రం కీలకం కానుంది. మరి ఈ సమ్మోహనం ఆడియన్స్ ను సమ్మోహనం చేస్తుందా లేదా అనేది మే 1న మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల కాబోతోన్న టీజర్  కొంత వరకూ చెబుతుందనుకోవచ్చు.
 

More Related Stories