English   

చిరంజీవి సరసన తమన్నా..?

Chiranjeevi-tamanna
2018-09-26 19:32:58

కొన్నాళ్ల క్రితం దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఓ టివి షో నిర్వహించాడు. ఇందులో తన గురించి యాంకర్స్ అడిగే విషయాలపై సమాధానాలిస్తూనే తన హీరోలు, హీరోయిన్లను కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చి.. వారి అభిప్రాయాల్ని కూడా తీసుకున్నాడు. అదే సందర్భంలో అప్ కమింగ్ దర్శకులు, హీరోలు, హీరోయిన్లను కూడా ఈ షోకు తీసుకువచ్చారు. అలా ఓ సారి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. చిరంజీవి మెగాస్టార్ కావడం వెనక బి గోపాల్ తర్వాతి స్థానం ఖచ్చితంగా రాఘవేంద్రరావు పేరే ఉంటుంది కదా.. లేదా ఇద్దరూ సమానంగా ఉంటారు. ఆ రోజు అదే షోకు తమన్నా కూడా వచ్చింది. అప్పటికే తమన్నా రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసింది. కానీ అప్పుడు చిరంజీవి పాలిటిక్స్ లో ఉన్నాడు. నో మూవీస్. అప్పుడు రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్న.. ఒకవేళ మళ్లీ సినిమాలు చేస్తే హీరోయిన్ గా ఎవరైతే బావుంటుందనుకుంటున్నావ్ బాబాయ్ అని. చిరు క్షణం కూడా ఆలోచించకుండా తమన్నాతో చేయాలనుకుంటున్నా అన్నాడు. కట్ చేస్తే అదిప్పుడు నిజం కాబోతోందంటోంది టాలీవుడ్. అది కూడా ఓ టాప్ డైరెక్టర్ తో.

యస్.. మెగాస్టార్ చిరంజీవితో నటించాలని మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కోరుకుంది. ఫైనల్ గా తన కోరిక నెరవేరేలానే ఉంది. యస్.. ప్రస్తుతం మెగాస్టార్ ‘సైరా’ చేస్తున్నాడు. హిస్టారికల్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రొడక్షన్ వర్క్స్ మరో మూడు నెలల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ సినిమాలోనే తమన్నా.. చిరంజీవి సరసన నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి కొరటాల శివ భరత్ అనేనేను తర్వాత వెంటనే చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు. కానీ సైరా వల్ల బాగా లేట్ అయింది. ఈ లోగా తను కూడా కాస్త రెస్ట్ తీసుకుని ఇంకా మంచి కథ సిద్ధం చేసుకోవాలనుకున్నాడు. ఆ కథనే రీసెంట్ గా చిరజీవికి చెప్పినట్టు.. దానికి చిరు ఓకే చెప్పినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి మెగాస్టార్ లాంటి హీరో ఓకే చెప్పాక దర్శకుడు ఖాళీగా ఉంటాడా.. అందుకే ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు టాక్. అందులో భాగంగానే హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారంటున్నారు. 

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. అలాగే తను సైరాలో కూడా ఓ  పాత్రలో నటిస్తుండటం విశేషం. మొత్తంగా చిన్న పాత్రతో మొదలై హీరోయిన్ గా మారబోతోందన్నమాట. మరి ఈ కాంబినేషన్(నిజమే అయితే) ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories