English   

రాక్‌స్టార్ కి మెగాస్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్

Chiranjeevi
2021-02-22 11:18:35

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా "ఉప్పెన".ఈ సినిమాలో క్రితి శెట్టి హీరోయిన్ గా నటించి అలరించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను రీచ్ అయ్యి సక్సెస్ గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుండి పాటలే సినిమాకు ప్రమోషన్ గా మారాయి. ముఖ్యంగా సినిమా లోని "నీ కళ్ళు నీలి సముద్రం" పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా విజయం లోనూ ఈ సినిమా మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించింది. 

ఈ నేపథ్యం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్షన్ దేవి శ్రీ కి మెగాస్టార్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ తో పాటు ఓ లెటర్ ను పంపించారు. ఆ లెటర్ లో మెగాస్టార్.."ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాష‌న్ తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే  ప్యాష‌న్‌తో మ్యూజిక్ నిస్తావ్‌.  నీలో వుండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ డీ ఎస్పీ యూ ఆర్ ట్రూలీ రాక్ స్టార్..ప్రేమతో చిరంజీవి." అంటూ చిరు లేఖలో పేర్కొన్నారు. ఇక తనకు గిఫ్ట్ పంపినందుకు గాను మెగాస్టార్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ దేవి శ్రీ ప్రసాద్ ఒక వీడియో పోస్ట్‌చేశారు.

More Related Stories