English   

చిరు 152వ సినిమాపై చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చేశాడు !!

Ram-charan
2019-01-09 17:52:16

శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళిన చిరు ఆ తర్వాత అసలు సినిమాలే చేయలేదు. అలా తొమ్మిదేళ్ల త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం త‌న కెరియ‌ర్‌ లోనే మొదటిసారిగా సైరా అనే ఒక హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. చిరు 151వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిక్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాని స‌మ్మ‌ర్‌ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు ఏమి సినిమాల‌ చేస్తారనే దాని మీద కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. సైరా సినిమా త‌ర్వాత వెంట‌నే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సందేశాత్మ‌క విలువ‌ల‌తో కూడిన చిత్రం ఒక‌టి చిరు చేయ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుండో ప్ర‌చారం జరిగింది. కానీ దానికి విరుద్దంగా ఇటీవ‌ల విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో త్రివిక్ర‌మ్ తో క‌లిసి డివీవీ దాన‌య్య నిర్మాణంలో సినిమా చేయ‌బోతున్న‌ట్టు చిరు చేసిన ప్రకటన అభిమానుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసింది. వీరిలో ముందు ఎవరితో ఆయన సినిమా చేస్తున్నాడో అని వారు బుర్రలు బద్దలు కొట్టుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమి చిరు ముందు ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్నాడ‌నే దాని మీద రామ్ చ‌ర‌ణ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి 152వ సినిమాకు కొర‌టాల శివే ద‌ర్శ‌కుడని ఆ చిత్రం పూర్తయ్యాకే ఆయన తర్వాత సినిమా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందని వెల్ల‌డించారు. సొ మెగా ఫాన్స్ కి సగం బెంగ తీరినట్టే. ఎందుకంటే కొరటాల - చిరు కాంబినేషన్ అంటేనే ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు కదా.

More Related Stories