English   

కొర‌టాల పెద్దాయ‌న్ని క‌లిసాడా..?

Koratala-Siva

రెండు విజ‌యాలు అందుకోవ‌డ‌మే క‌ష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో వ‌ర‌స‌గా నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు కొర‌టాల శివ‌. భ‌ర‌త్ అనే నేను ఇంకా సేఫ్ జోన్ కు రాక‌పోయినా.. ఈ చిత్రం 90 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. మ‌హేశ్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా నిలిచి పోయింది. మ‌రో 9 కోట్లు వ‌స్తే కానీ ఈ చిత్రాన్ని హిట్ అన‌లేం కానీ కొర‌టాల ప‌రంగా చూస్తే మాత్రం ఈ చిత్రం హిట్టే. ఇక ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. అఖిల్ కోసం ప్ర‌స్తుతం ఓ క‌థ సిద్ధం చేస్తున్న కొర‌టాల శివ‌.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని క‌లిసాడ‌ని తెలుస్తుంది. ఓ క‌థ కూడా చెప్పాడ‌ని.. సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ‌నే మెగాస్టార్ ఇమేజ్ కు స‌రిపోయేలా అల్లుకున్నాడ‌ని తెలుస్తుంది. పైగా సందేశాత్మ‌క క‌థ‌లు చేయ‌డానికి చిరంజీవి ఎప్పుడూ ఆస‌క్తి చూపిస్తుంటాడు. ఇప్పుడు కొర‌టాల కూడా ఇదే చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల చెప్పిన లైన్ కి మెగాస్టార్ కూడా ఫిదా అయ్యాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న సైరాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు ఈ చిత్రానికే మెగాస్టార్ అంకితం అవ్వ‌డం ఖాయం. ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శీనుతో ఓ సినిమా చేయాల్సి ఉంది చిరు. అవ‌స‌రం అనుకుంటే ఈ చిత్రాన్ని ఆపి మ‌రీ కొర‌టాల‌కు జంప్ అయ్యేలా ఉన్నాడు మెగాస్టార్. ఎందుకంటే ప్ర‌స్తుతం బోయ‌పాటి కంటే కొర‌టాల‌కు క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ ఎక్కువ‌. చూడాలిక‌.. చిరుతో కానీ కొర‌టాల సినిమా వ‌ర్క‌వుట్ అయిందంటే మ‌నోన్ని ప‌ట్టుకోవ‌డం క‌ష్టం. 

More Related Stories