English   

యండ‌మూరిపై క‌సి తీర్చుకున్న చిరు..

Chiru revenge on Yandamuri
2018-06-11 08:05:47

చిరంజీవికి యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ తో ఉన్న ప‌రిచ‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే చిరంజీవి మెగాస్టార్ గా ఎద‌గ‌డంలో యండ‌మూరి పాత్ర కూడా ఉంది. 80ల్లో ఈయ‌న న‌వ‌ల‌ల‌తోనే అభిలాష‌.. ఛాలెంజ్.. మ‌ర‌ణ‌మృదంగం.. రాక్ష‌సుడు లాంటి సంచ‌ల‌న సినిమాలన్నీ చేసాడు చిరంజీవి. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి స్టువ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ సినిమా కూడా చేసారు. దీనికి యండ‌మూరే ద‌ర్శ‌కుడు కూడా. ఈ చిత్రం అప్ప‌ట్లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం గురించి అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోని టైమ్ లో ఇప్పుడు మ‌ళ్లీ తిర‌గ‌తోడాడు మెగాస్టార్. తేజ్ ఐ ల‌వ్ యూ ఆడియో వేడుక‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ కు కేవ‌లం త‌న వ‌ల్లే ఫ్లాప్ వ‌చ్చింద‌ని చాలాసార్లు బాధ ప‌డ్డాన‌ని.. దానికి ఇప్పుడు ఇంత‌మంది ముందు రామారావును సారీ అడుగుతున్నాన‌ని చెప్పాడు చిరు. ఇక ఈ చిత్ర ద‌ర్శ‌కుడిగా యండ‌మూరిని వ‌ద్ద‌ని కేఎస్ రామారావు అన్నా కూడా తానే ప‌ట్టు బ‌ట్టి మ‌రీ ఆయ‌న‌కు అవ‌కాశం ఇప్పించి త‌ప్పు చేసాన‌ని చెప్పాడు మెగాస్టార్. అయితే ఇప్పుడు ఈ విష‌యాన్ని గుర్తు చేసుకోవాల్సిన ప‌నిలేదు కానీ ఆ మ‌ధ్య యండ‌మూరి మెగా వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ పై కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేసాడు. దానికి పర్యావ‌సానంగానే ఇప్పుడు చిరు స్టువ‌ర్టు పురం టాపిక్ తీసార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. కేవ‌లం యండ‌మూరి త‌ప్పిదం వ‌ల్లే సినిమా ఫ్లాప్ అయింద‌ని అర్థం వ‌చ్చేలా మాట్లాడారు చిరు. మొత్తానికి ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ముగ్గురు ఎప్పుడూ క‌లిసి ప‌ని చేయ‌లేదు. 

More Related Stories