English   

నానికి గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

Chiru
2021-02-24 17:12:40

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నవారిలో చాలా మంది యంగ్ హీరోలు మెగాస్టార్ అభిమానులే. కాగా నాచురల్ స్టార్ నాని కూడా మెగాస్టార్ అభిమానే ఆట. ఎంత పెద్ద అభిమాని అంటే నాని ఇంట్లో ఎంతో గొడవ చేసి కొనుక్కున్న సైకిల్ ను పోగొట్టుకునేంత. అయితే ఆ సైకిల్ ను మెగాస్టార్ తిరిగి నానికి గిఫ్ట్ గా ఇచ్చారట.  అసలు నాని సైకిల్ ను ఎందుకు పోగొట్టుకున్నాడు. మెగాస్టార్ ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. నాని చిన్నప్పుడు అమీర్ పేట్ లో నివాసం ఉండేవారు. ఆ సమయంలో మెగాస్టార్ "మాస్టర్" సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా చూడ్డానికి నాని తన కొత్త సైకిల్ తో అమీర్పేట్ సత్యం థియేటర్ కు వెళ్ళాడు. 

టికెట్ల కోసం అక్కడ గొడవ జరుగుతుండగా..నాని సైకిల్ ను దూరంగా పార్క్ చేసి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసి సంపాదించాడు. అయితే టికెట్ తీసుకునే టెన్షన్ లో నాని  సైకిల్ తాళం వెయ్యడం మర్చిపోయాడట. దాంతో ఆ సైకిల్ ఎవరో ఎత్తుకెళ్లారట. అయినా టెన్షన్ పడకుండా సినిమా చూసేసాడట. ఈ విషయాన్ని "మీలో ఎవరు కోటీశ్వరుడు" షోలో చిరు హోస్ట్ గా ఉన్న సమయంలో  గెస్ట్ గా వచ్చిన నాని షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ ను తనకు సైకిల్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. ఆ స్టోరీ విని గట్టిగా నవ్వేసిన చిరు నానికి సైకిల్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం మూడేళ్ళ క్రితం జరగ్గా నాని బర్త్ డే సంధర్బంగా మళ్ళీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 

More Related Stories