English   

చిరు బ‌ర్త్ డే ట్రీట్ ఇస్తాడా..?

chiru sye ra redddy first look on his birthday treat
2018-06-09 07:59:06

ఒక‌ప్పుడు చిరంజీవి పుట్టిన‌రోజు వ‌స్తుందంటే అభిమానుల‌కు పండ‌గే. ఆ రోజు ఫ్యాన్స్ కే ప‌రిమితం చేసేవాడు మెగాస్టార్. కానీ ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయిన త‌ర్వాత ఆ క‌ళ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఈయ‌న పుట్టిన‌రోజు ముందులా ఇప్పుడు లేదు. కానీ ఈ సారి మాత్రం మ‌ళ్లీ అలాగే చేయాల‌ని భావిస్తున్నాడు చిరంజీవి. అందుకే ఆగ‌స్ట్ 22న సైరా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇక్క‌డే సెట్ వేసి.. నాన్ స్టాప్ గా 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ షెడ్యూల్ తోనే దాదాపు 70 శాతం టాకీ పూర్తి కానుంది. డిసెంబ‌ర్ లోపు పూర్తి షూటింగ్ చేయాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనికి చిరంజీవి నుంచి కూడా పూర్తి స‌హకారం అందుతుంది. సైరా ఫ‌స్ట్ లుక్ భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. 200 కోట్ల ప్రాజెక్ట్ కావ‌డంతో క‌చ్చితంగా అంచ‌నాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. అందుకే ఎక్క‌డా చిన్న పొర‌పాటు కూడా జ‌ర‌క్కుండా త‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ సురేంద‌ర్ రెడ్డికి సూచ‌న‌లు ఇస్తున్నాడు మెగా వార‌సుడు. 

More Related Stories