English   

పుష్పకు విలన్ గా చియాన్

 Allu Arjun
2020-11-25 15:48:49

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా "పుష్ప". ఈ సినిమాను ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడ్ పల్లి అడవుల్లో జరుగుతోంది. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ కథ నేసథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒకే చెప్పారు. 

కాగా ఇటీవల ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా పుష్ప నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తిగా మారింది. విజయ్ ప్లేస్ లో ఉపేంద్ర, ఆర్య, సుదీప్ లు నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకోసం పుష్ప టీం విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టాప్ హీరో అయిన విక్రమ్ "పుష్ప "కు ఒకే చెబుతారా లేదా అన్నదానిపై ఆసక్తి మొదలైంది.

More Related Stories