English   

క్లైమాక్స్ ట్రైలర్ .. బిచ్చగాడికైనా బిల్ గేట్స్ కి అయినా కష్టాల్లో తేడా ఉండదు

CLIMAX
2021-02-20 17:49:38

నటుడు రాజేంద్రప్రసాద్ మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతోనే ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. ఎమోషనల్ సన్నివేశాలు అయినా అయినా కామెడీ సన్నివేశాలు అయినా అవలీలగా నటిస్తుంటారు. ఇప్పుడు మరో ప్రయోగంతో రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం పేరు "క్లైమాక్స్" కాగా సినిమాను భవాని శంకర్ తెరకెక్కిస్తున్నారు. కైపాస్ ప్రొడక్షన్ హౌస్ అనే నిర్మాణ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని పాంజాబ్ నేషనల్ బ్యాంక్ కు డబ్బు ఎగ్గొట్టి విదేశాలకు పరార్ అయ్యిన నీరవ్ మోడీ ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సినిమాలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా కీలక పాత్రలో నటిస్తుంది. 30 ఇయర్స్ పృద్విరాజ్ కూడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇప్పటి వరకు రాంజేంద్ర ప్రసాద్ కనిపించని విధంగా ఈ సినిమాలో రొమాంటిక్ ఫెలో గా కనిపించబోతున్నాడు. అంతే కాకుండా డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. "బిచ్చగాడికి అయినా..బిల్ గేట్స్ కు అయినా కష్టాల్లో తేడా ఉండదు" లాంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను  ఫిబ్రవరి 27 విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

More Related Stories