English   

మ‌నవ‌డితో ఆడుకుంటున్న బ్ర‌హ్మానందం..

comedian brahmanandam playing along with his grandson
2019-02-10 05:30:19

ఈ మ‌ధ్య కాలంలో బ్ర‌హ్మానందం ఆరోగ్యంపై చాలా వార్త‌లు వినిపించాయి. దానికితోడు ఆయ‌న హార్ట్ స‌ర్జ‌రీ కూడా చేయించుకుని వ‌చ్చారు. ప్ర‌స్తుతం కుటుంబంతో పాటు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు కామెడీ కింగ్. మొన్న‌టికి మొన్న హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఇప్ప‌ట్లో ఈయ‌న్ని సినిమాల్లో చూడ‌టం క‌ష్ట‌మే. దొరికిన టైమ్ హాయిగా మ‌న‌వ‌డితో గ‌డిపేస్తున్నాడు ఈయ‌న‌. త‌న‌యుడు గౌత‌మ్ కొడుకుతో ఆడుకుంటూ ఫోటోల‌కు పోజులు ఇస్తున్నాడు బ్ర‌హ్మి. ప్ర‌స్తుతం ఈయ‌న హైర‌దాబాద్ లోనే ఉన్నాడు. ఈయ‌న్ని క‌ల‌వ‌డానికి ఇండ‌స్ట్రీ నుంచి కూడా చాలా మంది బ్ర‌హ్మానందం ఇంటికి వెళ్తున్నారు. మొన్న‌టికి మొన్న వెళ్లి బ‌న్నీ క‌లిసొచ్చాడు.. చిరు కూడా క‌లిసాడని తెలుస్తుంది. దానికితోడు ఇంకా చాలా మంది బ్ర‌హ్మానందం ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. మ‌రోవైపు ఈయ‌న మాత్రం టైమ్ అంతా మ‌న‌వ‌డితో ఆడుకోడానికి స్పెండ్ చేస్తున్నాడు. మొత్తానికి బ్ర‌హ్మి తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది. మ‌రి ఈయన్ని మ‌ళ్లీ తెర‌పై ఎప్ప‌టికి చూస్తామో చూడాలి.

More Related Stories