English   

అవును నిజ‌మే.. సునీల్ క‌మెడియ‌న్ కాదు

Comedian Sunil Did Serious Role in Aravinda Sametha
2018-10-11 21:16:35

వారం రోజుల కింద ఇదే మాట ఎన్టీఆర్ కూడా చెప్పాడు. తాను ఎప్పుడూ సునీల్ ను క‌మెడియ‌న్ గా చూడ‌లేదు.. అత‌డు ఓ అద్భుతమైన న‌టుడు అని చెప్పాడు. కాక‌పోతే మ‌నం వాళ్ల‌ను వాడుకోలేదంతే అన్నాడు. అస‌లు ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు అర‌వింద స‌మేత చూస్తే అర్థ‌మైపోతుంది. ఇదివ‌ర‌కు సునీల్ క‌మెడియ‌న్ గా ఎలా ఉండేవాడో తెలుసు.. హీరో అయిన త‌ర్వాత ఎలా ఉన్నాడో తెలుసు..  ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే అభిమానులెంత‌గానో ఆయ‌న కోసం ఎదురు చూసారు. అయితే ఇప్పుడు అంద‌రికీ షాక్ ఇచ్చే రీ ఎంట్రీ ఇచ్చాడు సునీల్. అర‌వింద స‌మేత‌లో ఆయ‌న పూర్తిగా న‌వ్విస్తాడేమో అనుకుంటే క‌మెడియ‌న్ గా కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.

సునీల్ లో త‌న‌కు మంచి న‌టుడు క‌నిపిస్తాడు అనే మాట‌ను నిజం చేస్తూ నిజంగానే ఇప్పుడు అర‌వింద‌స స‌మేత‌లో ఆయ‌న కేవ‌లం కామెడీ మాత్ర‌మే కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే స‌త్తా చూపించాడు. ఈ చిత్రంతో మ‌ళ్లీ అతడు బౌన్స్ బ్యాక్ అయిపోతాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే ఇప్పుడు ఈయ‌న‌కు కారెక్ట‌ర్ రోల్స్ ఇవ్వాలా లేదంటే కామెడీ రోల్స్ ఇవ్వాలా అనేది మాత్రం అర్థం కావ‌డం లేదు ద‌ర్శ‌కుల‌కు. ఎందుకంటే అర‌వింద స‌మేత‌లో అలాంటి పాత్రే ఇచ్చాడు త్రివిక్ర‌మ్. రీ ఎంట్రీ ఘ‌నంగానే ఉన్నా.. ఇప్ప‌ట్నుంచి అస‌లు క‌న్ఫ్యూజ‌న్ మొద‌లవుతుంది ఈ భీమ‌వ‌రం బుల్లోడికి. అన్న‌ట్లు ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ప‌డిప‌డి లేచే మ‌న‌సుతో పాటు కిషోర్ తిరుమ‌ల చిత్ర‌ల‌హ‌రి బార్ అండ్ రెస్టారెంట్ లోనూ న‌టిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. వీటిలో సునీల్ ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడో..?

More Related Stories